'ఆర్ ఆర్ ఆర్' అంచ‌నాల‌ను పెంచేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్  ఈ  చిత్రంలో న‌టిస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

ఇద్ద‌రు పోరాట యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థ‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆర్ ఆర్ ఆర్‌కి ఫుల్ ఫామ్‌ను ఇచ్చారు. ‘‘ రౌద్రం రుధిరం రణం’’గా సినిమా టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఒక ప‌క్క రామ్‌చ‌ర‌ణ్‌ను నిప్పుతో.. మ‌రో ప‌క్క ఎన్టీఆర్‌ను నీరుతో చూపిస్తూ వారిద్ద‌రూ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చే స‌న్నివేశాన్నే మోష‌న్ పోస్ట‌ర్‌గా చూపించారు. అందులో టైటిల్‌ను ఆవిష్క‌రించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ భాష‌ల్లో ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అలాగే ఈ క‌థ 1920లో జ‌రిగే క‌థ అని మోష‌న్ పోస్ట‌ర్‌లో చెప్పారు. మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేస్తుంది.

సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న సంక్రాంతి సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తార‌క్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్, ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, ఆలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ కూడా న‌టిస్తున్నారు.

More News

ప్రజా ప్రతినిధులకు వార్నింగ్.. రైతన్నకు అభయం!

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదని.. రేపట్నుంచి రంగంలోకి దిగి క్రియాశీలకంగా పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రైతన్నలకు కేసీఆర్ శుభవార్త చెప్పారు.

21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇవాళ అనగా మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని

కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఒలింపిక్స్ క్రీడలపై కూడా పడింది. ఈ క్రమంలో జపాన్‌లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది.

చిరు 152లో రంగ‌మ్మ‌త్త‌ ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఇప్పుడు సెట్స్‌లో ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఇప్ప‌టికే రెజీనా క‌సండ్ర ఓ స్పెష‌ల్

బాలీవుడ్ 'భీష్మ' ఎవ‌రంటే?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న తెలుగులో విడుద‌లైన భీష్మ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కింది. ర‌ష్మిక మంద‌న్న