RRR: ఉగాది ట్రీట్‌గా టైటిల్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్‌కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పలేదు. దీంతో మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. ఇప్పటికే 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన అనంతరం యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున షికార్లు చేశాయి.

ఉగాది సర్‌ఫ్రైజ్‌గా టైటిల్

అయితే.. తాజాగా ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న ఔత్సాహికులు చిత్ర యూనిట్ ఓ శుభవార్త తెలిపింది. అదేమిటంటే.. ‘ఆర్ఆర్ఆర్‌’ మూవీకి సంబంధించిన టైటిల్‌ను సర్‌ఫ్రైజ్‌గా ఇవ్వబోతోంది యూనిట్. అంతేకాదు దీంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. రేపు అనగా ఉగాది (మార్చి-25) నాడు ఈ సర్‌ఫ్రైజ్ తెలియనుంది. దీన్ని సర్‌ఫ్రైజ్ అనడం కంటే ట్రీట్ అంటే సరిపోద్దేమో. ఈ ప్రకటన రావడంతో ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా..? ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తందా..? అని మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. మరోవైపు.. ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, చెర్రీ పుట్టిన రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశాలున్నాయని ఇప్పటికే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. అసలు ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి..? అనేది బుధవారంతో తేలిపోనుందన్న మాట.

More News

క‌రోనా ప్ర‌భావం... క‌త్రినా అలా! కాజ‌ల్ ఇలా

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినీ రంగం అంతా స్త‌బ్ద‌త నెల‌కొంది. షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ తార‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైయారు.  ప‌లువురు ప‌లు ర‌కాలుగా స‌మ‌యాన్ని వెల్ల‌దీస్తున్నారు.

షాకింగ్.. చైనాలో మరో ప్రాణాంతక వైరస్..!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచం నలువైపులా విసర్తిరించడంతో ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాలు దాటేసిన ఈ వైరస్ ఎప్పుడు ఎవర్ని సోకుతుందో..?

కరోనాపై ఆందోళన వద్దు.. పారాసిట్‌మాల్‌ వేసుకోండి!

కరోనాపై ఆందోళన వద్దని.. పారాసిటిమాల్ వేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. కాగా ఇదివరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే పారాసిటిమాల్, బ్లీచింగ్ పౌడర్

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు నిర్మలమ్మ శుభవార్త!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి

కరోనాపై యుద్ధం.. విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.