భారీ బడ్జెట్ మూవీగా #RRR
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి #RRR అంటూ ఓ వీడియోను కూడా రాజమౌళి విడుదల చేశారు. ఈ దశాబ్దానికే ఓ పెద్ద మల్టీస్టారర్ మూవీగా నిలిచిపోబోయే ఈ సినిమాకి సంబంధించి ఏ విషయమైనా సంచలనమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని చిత్రీకరించబోతున్నారని సమాచారం. చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య కెరీర్‌లోనే ఇది ఒక భారీ బడ్జెట్ మూవీగా నిలుస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాని తెలుగుతో పాటు.. తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వేసవి (2019)కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాలు పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments