RRR అప్డేట్: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

  • IndiaGlitz, [Sunday,September 08 2019]

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా ‘RRR’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు, రూమర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. తాజాగా వచ్చిన అప్డేట్ ఇటు జక్కన్న.. అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో సంతోషాన్ని నింపే వార్త కావడం విశేషం.

కొమురం భీం అక్టోబర్ 22, 1901న జన్మించిన సంగతి తెలిసిందే. కాగా.. ‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్ ఉద్యమకారుడు కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. అయితే జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న నందమూరి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది రాజమౌళి, ఎన్టీఆర్‌కే తెలియాలి. అయితే ‘RRR’ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయం మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. ఇటీవల తెల్లపిల్ల దొరికిందని.. తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. ఒకేసారి నాలుగు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పడమంటే మామూలు విష‌యం కాదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే.

More News

ఆ డైరెక్ట‌ర్ బాట‌లో హ‌రీశ్ శంక‌ర్ ట్రావెల్ చేస్తున్నాడా?

షాక్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా షాక్ తిన్న హరీశ్ శంక‌ర్ త‌ర్వాత మిర‌ప‌కాయ్ చిత్రంతో పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేసిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌`

'అల‌.. వైకుంఠ‌ట‌పుర‌ములో..' స్టోరీపై క‌థ‌నాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అల‌... వైకుంఠ‌పురములో..`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు లీక్ అంటూ సోష‌ల్ మీడియాలో

కొలువుదీరిన తెలంగాణ కొత్త కేబినెట్

తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. శనివారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళ్ శై సౌందరరాజన్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

ఇస్రో కీలక ప్రకటన.. ‘విక్రమ్‌’ ల్యాండర్‌ లోకేషన్‌ గుర్తింపు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని

అంతా వైసీపీ ఎమ్మెల్యే వల్లే...: హీరో నాని

ఇదేంటి.. వైసీపీ ఎమ్మెల్యేకు.. నేచురల్ స్టార్ నానికి ఏం సంబంధం..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే వైసీపీ ఎమ్మెల్యేతో నానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.