'RRR' ఫుల్ ఫామ్ ఇదేనట.. త్వరలో అధికారిక ప్రకటన!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పకపోవడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే ఈ ఏడాది జూన్ లేదా జులైలో సినిమా రిలీజ్ అవుతుందని ఇదివరకే ప్రకటించిన జక్కన్నా.. తీరా చూస్తే వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయడంతో తీవ్ర అసంతృప్తితో అభిమానులు, సినీ ప్రియులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో.. ఫిల్మ్‌నగర్‌లో వైరల్ అవుతోంది.
ఇదే పక్కానా!?
‘RRR’ ఫుల్ ఫామ్ కన్ఫామ్ అయ్యిందనేది ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సారాంశం. ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనేది ఒక భక్తి గీతమన్న సంగతి తెలిసిందే. ఆ గీతం జాతిపిత మహాత్మ గాంధీకి ఎంతో ఇష్టమైనది కూడా. మహాత్ముడి ద్వారానా ఈ పాట చాలా పాపులర్ అయ్యింది కూడా. అయితే ప్రస్తుతం తాను తీస్తున్న సినిమా కూడా స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించినది కాబట్టి ఆ టైటిల్‌నే రాజమౌళి మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యారట. టైటిల్ ఇదయితేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారని భావించిన జక్కన్న దాదాపు ఫిక్సయిపోయారట. ఒక్క రాజమౌళీనే కాదు ఆయన సన్నిహితులు, నిర్మాతలు, చెర్రీ-ఎన్టీఆర్ కూడా ఇదే ఫైనల్ చేసేశారట. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే సుమారు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. ఈ భారీ బడ్జెట్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. భారీ మల్టీస్టారర్.. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రం కావడంతో సినిమాపై అంతకుమించి అంచనాలు ఉన్నాయ్. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com