రాజమౌళికి షాకిచ్చిన గూగుల్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన బాహుబలి తర్వాత తెరకెక్కిస్తోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో గూగుల్ రాజమౌళికి పెద్ద షాకే ఇచ్చిందట. ఎలాగంటే.. `ఆర్ఆర్ఆర్` సినిమా డైరెక్టర్ ఎవరని గూగుల్‌లో సెర్చ్ చేస్తే డైరెక్టర్ రాజమౌళి పేరుతో సంజయ్ పాటిల్ అనే వ్యక్తి పేరు కూడా వస్తుంది. అసలు ఈ సంజయ్ పాటిల్ ఎవరు? అని సెర్చ్ చేస్తే అతని వివరాలు మాత్రం దొరకడం లేదు.
టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడె కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇద్దరు పోరాట యోధులకు సంబంధించిన కల్పితగాథతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆలియాభట్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments