RRR: ట్రేడ్ దద్దరిల్లే రికార్డ్.. రూ. 325 కోట్లంటే మాటలా!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడంతో యావత్ దేశం దృష్టి ఈ చిత్రంపై ఉంది. సినీ అభిమానులంతా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
బాహుబలి చిత్రం సృష్టించిన కలెక్షన్ల సునామిని బాలీవుడ్ సైతం కళ్లారా చూసింది. అందుకే ఆర్ఆర్ఆర్ పై ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ విషయంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ పోటీలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ 'జీ' సంస్థ ముందడుగు వేసినట్లు టాక్.
ఇదీ చదవండి: డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని
అన్ని భాషలకు గాను ఆర్ఆర్ఆర్ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులని జీ నెట్వర్క్ సొంతం చేసుకుందట. ఇందుకోసం దాదాపు రూ 325 కోట్ల రికార్డ్ డీల్ కుదిరిందట. అంటే రిలీజ్ కు ముందే ఆర్ఆర్ఆర్ నిర్మాతకు 325 కోట్లకు వచ్చేసినట్లే. ఇండియన్ సినీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగితే.. ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ 800 కోట్లు దాటబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండడంతో నార్త్ లో కూడా ఆర్ఆర్ఆర్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout