మేజర్ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోవిడ్ లాక్డౌన్ తర్వాత పునః ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. 50 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో మేజర్ యాక్షన్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ అంతా రాత్రి వేళల్లోనే చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేయడమే కాకుండా తదుపరి షెడ్యూల్‌ను వెంటనే స్టార్ట్ చేస్తామని అన్నారు. తదుపరి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ షెడ్యూల్లో అజయ్ దేవగణ్, ఆలియా భట్ పాల్గొంటారని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
Goodbye winter nights!!!??
— RRR Movie (@RRRMovie) November 30, 2020
Wrapped up a major action sequence schedule after almost 50 days of night shoot...????
Andddd nowww... Gearing up for a new schedule in some exotic locations :) #RRRMovie pic.twitter.com/MZnoQ0PcgN
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments