`RRR` బల్గేరియా షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Monday,September 16 2019]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం 'RRR'. దాదాపు రూ.300కోట్ల‌కుపై బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ పాత్ర‌ల మ‌ధ్య జ‌రిగే క‌ల్పిత‌గాథ ఈ సినిమా. ఈ ప్రెస్టీజియ‌స్ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో.. అ్ల‌లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల బల్గేరియాలో చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది. ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశాలు స‌హా కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ట‌. షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డంతో ఎన్టీఆర్ హైద‌రాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ హైద‌రాబాద్ చేరుకున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా త‌దుప‌రి షెడ్యూల్‌ను చ‌ర‌ణ్‌పై రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్‌.

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్, కోలీవుడు న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. రామ‌రాజు జోడి సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు విప్ల‌వ నాయ‌కుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. 'బాహుబ‌లి' త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంద‌రిలో సినిమా గురించి ఆస‌క్తి నెల‌కొంది. వ‌చ్చే ఏడాదిజూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

More News

‘వాల్మీకి’ వివాదం: నాకేం తెలీదు కథ మాత్రమే!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

'వాల్మీకి' పై సెన్సార్‌బోర్డుకి ఫిర్యాదు

త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా`ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రం `వాల్మీకి`. సెప్టెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది.

హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు కోలుకోలేని షాక్!

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో కోలుకోలేని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే.

గ‌ణిత మేధావి పాత్ర‌లో విద్యాబాల‌న్‌...

సిల్క్ స్మిత జీవితాన్ని డ‌ర్టీపిక్చ‌ర్ అంటూ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అందులో సిల్క్ స్మిత‌గా న‌టించిన విద్యాబాల‌న్,

కోడెల మృతిపై తెలంగాణ సర్కార్ విచారణ!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వస్తున్న విషయం తెలిసిందే.