'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం స్టార్ట్.. ‘బాహుబలి’ రికార్డ్ బ్రేక్!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన సినిమా వస్తోందంటేనే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిదీ ఆసక్తికరమే. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. దీనికున్న క్రేజ్‌తో సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌కి సంబంధించిన ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఏరియాల వారీగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బిజినెస్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ‘బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ బాహుబలి రికార్డును ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది. ఏ సినిమా వచ్చినా నాన్ బాహుబలి రికార్డులను మాత్రమే క్రియేట్ చేసింది. తాజాగా దర్శకధీరుడు తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టారని టాక్. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను కోలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థగా పేరున్న లైకా ప్రొడక్షన్స్ రూ.42 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ‘బాహుబలి 2’ చిత్రానికి సంబంధించిన తమిళ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. దీనిని బట్టి చూస్తే బాహుబలి రికార్డ్‌ను ‘ఆర్ఆర్ఆర్’బీట్ చేసేసింది.
ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం స్టార్ట్ అయిపోయిందంటూ సంబరపడిపోతున్నారు. ఫిక్షనల్ పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్ స్టార్ అలిసన్ డూడీ తదితర ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments