మూడు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ప్రైజ్!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుుతన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా ఓ అప్డేట్ విడుదలై అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ జస్ట్ త్రీ డేస్‌లో రాబోతోంది. ఈ త్రీ డేస్‌లో ఏముందని అప్డేట్ ఇవ్వడానికి అంటారా?
ఓ అద్భుతమైన అప్డేట్ ఉంది. ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగానూ.. తారక్ కొమురం భీమ్గానూ అలరించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి గురువు పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నారు. మరో మూడు రోజుల్లో అజయ్ దేవగన్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ సర్ప్రైజ్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే భీమ్, రామరాజులతో ఉన్న అజయ్ దేవగన్ పోస్టర్ని రిలీజ్ చేస్తారా లేక కేవలం అజయ్ దేవగన్ సోలో పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి వరుస అప్డేట్స్తో ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీ నటుల బర్త్ డేలను టార్గెట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న రాజమౌళి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కోమరం భీమ్ల టీజర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ సినిమాలో రామరాజుకి జంటగా సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ లుక్‌ని రిలీజ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com