హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఆలియా భట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్... స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. ఇంతకీ ఆలియా భట్‌కు సమస్యేంటి? అనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆలియా భట్ నటిస్తోన్న చిత్రం గంగూబాయ్ కతియావాడి. సంజయలీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో హైపరాసిడిటీ, ఆలసట, వికారంతో బాధపడటంతో ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. చెకప్ అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ముంబై లేడీ మాఫియా డాన్ గంగూబాయ్ జీవితకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆపాలంటూ గంగూబాయ్ తనయుడు లీగల్ నోటీసులు పంపాడు. ఈ లీగల్ సమస్య నడుమే ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. దీపావళికి సినిమాను విడుదల చేయాలనేది దర్శక, నిర్మాతలు ప్లాన్.
ఈ సినిమాతో పాటు ఆలియా భట్.. రణ్‌భీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తుంది. మరో వైపు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపులార్ సినిమాలోనూ ఆలియాభట్ నటించింది. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో ఈ ఏడాది పెళ్లి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రణ్‌భీర్, ఆలియా భట్ పెళ్లిపై క్లారిటీ వస్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com