'నీతో ఏదో చెప్పాలని ఉంది' సాంగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించనున్న ఆర్.పి.పట్నాయక్

  • IndiaGlitz, [Friday,December 29 2017]

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, 'జయం', 'నువ్వు-నేను', 'సంతోషం', 'మనసంతా', 'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్. దర్శక నిర్మాతగా మారిన తర్వాత తన సంగీతంతో మ్యూజిక్ ప్రేమికులను అలరించడం తగ్గిపోయింది.

అయితే సంగీత ప్రేమికుల కోసం ఆర్.పి ఇప్పుడు 'నీతో ఏదో చెప్పాలని ఉంది' అనే మెలోడీ సాంగ్ను సిద్ధం చేశారు. ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సంగీతం అందించడమే కాకుండా ట్యూన్కు తగ్గ సాహిత్యం కూడా ఆర్.పియే అందించడం విశేషం. ఈ సాంగ్ను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. 'బాహుబలి' సినిమాలో 'మమతల తల్లి..' పాటను పాడి సత్య యామిని , అనుదీప్తో కలిసి సాంగ్ను ఆలపించారు.

ఈ సాంగ్ సంగీతం ప్రపచంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. అలాగే మంచి కాన్సెప్ట్స్తో కూడిన ఓరిజినల్ సాంగ్స్ను, మ్యూజిక్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి ఆదిత్యమ్యూజిక్ ఎప్పుడూ ముందుంటుంది.