పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికి..
- IndiaGlitz, [Friday,April 02 2021]
బుల్లెట్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు ఆటోలో వెంబడించి పట్టపగలు కత్తులతో పొడిచి చంపారు. సదరు రౌడీ షీటర్ మూడేళ్ల క్రితం తమ తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో పగ పెంచుకున్న కుమారులు సదరు వ్యక్తిని పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. అసలు విషయంలోకి వెళితే.. ఎంఐఎం నాయకుడు అసద్ ఖాన్, అంజద్ ఖాన్ మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. అసద్ కూతురితో అంజాద్ కుమారుడి వివాహం నాలుగేళ్ల క్రితం వైభవంగా జరిగింది. అయితే వివాహమైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి.
అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. అయితే వీరిద్దరి మధ్య గొడవకు అసదే కారణమని భావించిన అంజద్ అతనిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 2018లో అంజద్ మరో ఐదుగురితో కలిసి అసద్‌పై దాడి చేసి హతమార్చారు. దీంతో అంజద్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకు పంపించారు. కొంత కాలం క్రితమే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. అంజద్ జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి అదను కోసం హతుని కుమారులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అసద్ తన స్నేహితుడితో కలిసి గురువారం మధ్యాహ్నం బైక్‌పై మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ఇండియా ఫంక్షన్ హాల్ వెళుతున్నాడు. ఆ సమయంలో అతనికి ఎదురుగా వచ్చిన ఆటో వారి బైక్‌ను ఢీకొట్టింది.
వారు బైక్‌పై నుంచి పడిపోగా వెంటనే ఆటో నుంచి దిగి వేట కొడవళ్లతో అసద్‌పై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా పొడిచి అసద్ తలను ఛిద్రం చేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న మీదట కత్తులను అక్కడే పారేసి ఆటోలో రాంగ్రూట్లో పారిపోయారు. సమాచారం అందుకున్న మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.