చివరి షెడ్యూల్ లో 'రౌడీ పోలీస్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై.. నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్, కత్తి మహేష్, అమిత్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఏక్షన్ ఎంటర్ టైనర్ 'రౌడీ పోలీస్'. జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైద్రాబాద్ లోని రాక్ కేజిల్ లో జరుగుతోంది. గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ తదితరులపై రొమాంఛిత పోరాట దృశ్యాలను ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన షూటింగ్ కవరేజ్ ప్రెస్ మీట్ లో హీరోయిన్ గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్, కత్తి మహేష్, దర్శక నిర్మాత జానీ, ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫేర్ ముజీర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.
"మాఫియా బ్యాక్ డ్రాప్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'రౌడీ పోలీస్' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇటీవలకాలంలో సంచలనాలకు చిరునామాగా మారిన కత్తి మహేష్ పాత్ర సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు జరుగుతన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి మే చివరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని దర్శకనిర్మాత జానీ అన్నారు.
తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్నానని గుర్లిన్ చోప్రా వివరించగా.. 'అదుర్స్, కృష్ణ' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తెలుగులో 'రౌడీ పోలీస్' చేస్తున్నానని ముకుల్ దేవ్ అన్నారు.
దర్శకనిర్మాత జానీ 'రౌడీ పోలీస్' చిత్రాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారని.. దర్శకుడిగా తనకు మంచి పేరు, నిర్మాతగా మంచి లాభాలు తీసుకు వచ్చే చిత్రంగా 'రౌడీ పోలీస్' రూపొందుతున్నదని ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫేర్ ముజీర్ అన్నారు.
కత్తి మహేష్ మాట్లాడుతూ.. ముజీర్, జానీలతో తనకు గల అనుబంధం దృష్ట్యా ఈ చిత్రంలో ఒక మంచి మంచి పాత్ర చేస్తున్నానని అన్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com