Kalki 2898 AD:ప్రభాస్ 'కల్కి' సినిమాలో రౌడీ హీరో విజయ్ గెస్ట్ రోల్..!

  • IndiaGlitz, [Saturday,January 20 2024]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కల్కి2898AD'. భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌ మీద అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే9వ తేదీన మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గుంచి మరో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో పలు ఇండస్ట్రీలకు అతిరథ మహారథులు నటిస్తున్నారు.

ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా కూడా నటిస్తున్నాడని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది. తాజాగా ఈ మూవీలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మొదటి సారి ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో నటించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే నాగ్ అశ్విన్ నిర్మాతగా చేసిన జాతి రత్నాలు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.

ఇప్పుడు కల్కి సినిమాలో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడట. విజయ్ కోసం ఓ ప్రత్యేక పాత్ర క్రియేట్ చేశాడని చెబుతున్నారు. ఇక విజయ్‌తో పాటు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, దర్శకధీరుడు రాజమౌళి కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారట. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. దీంతో వీరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. ఇక జక్కన్న కూడా పలు సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు తగట్లే గతంలో విడుదలైన గ్లింప్స్ వీడియో ఉంది. కర్ణుడిని పోలిన పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని అంటున్నారు. అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ భారత సినీ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. అంతేకాకుండా గ్రాఫిక్స్, వీఎఫ్‌క్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More News

Tirumala Laddu: రాములోరి కోసం వెంకన్న.. అయోధ్యకు తిరుమల నుంచి లడ్డూలు తరలింపు..

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. రామ.. రామ.. ఇప్పుడు దేశమంతా రామ నామ స్మరణ మార్మోమోగుతోంది. శ్రీ రాముడు తన జన్మ భూమిలో కొలువు దీరే అమృత ఘడియలకు సమయం ఆసన్నమైంది.

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. రేవంత్ అండ్ టీం పర్యటనతో గతేడాది కంటే రెండింతలు ఎక్కువగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి.

పీవీఆర్ సినిమాస్‌లో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షప్రసారం

యావత్ ప్రపంచంలోని హిందూవులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అద్భుతమైన క్షణంకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట జరగనుంది.

CM Jagan:పెత్తందారుల కుట్రలను ఎదుర్కోవాలి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం జగన్..

విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.

CM Revanth Reddy:లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మూసీ అభివృద్ధిపై అధ్యయనం..

దావోస్ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం లండన్‌లో పర్యటిస్తోంది.