చిరుతో రౌడీ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడిప్పుడే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ప‌నిచేయ‌నున్నారా? అంటే అవున‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌‌పడుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ లూసిఫ‌ర్ సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో ఒక‌టైన పృథ్వీరాజ్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ పాత్ర‌లో న‌టిస్తార‌ని ముందుగా బ‌న్నీ ఆ త‌ర్వాత రానా ద‌గ్గుబాటి పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల్లో న‌టించ‌ని విజ‌య్ దేర‌వ‌కొండ, మ‌రి చిరంజీవితో న‌టించ‌డానికి ఓకే అంటారో లేదో చూడాలి. ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందుతోన్న ‘ఫైట‌ర్’ సినిమా కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాలో విల‌న్‌గా జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తార‌ని టాక్‌. అలాగే చిరు సోద‌రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ వార్త‌ల‌పై ఓ క్లారిటీ రానుంది.

More News

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది: శాస్త్రవేత్తల బృందం

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా పయనిస్తోందనే భయానక నిజాన్ని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఆగస్ట్ 15 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది... ఇంకేమంది.. మనమంతా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతామని భావిస్తున్న వారందరికీ కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

నా వీడియో ఆ ఇద్దరికీ చేరాలి..: వి.వి.వినాయక్

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ముఖ్యంగా ఇద్దరికి చేరాలని ఆయన కోరారు.

వర్మకు షాకిచ్చిన జూనియర్ పవన్ కల్యాణ్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ బయోపిక్ తీస్తున్నానని ఒకసారి..

4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్

4వ తరగతిలోనే ప్రేమలో పడ్డాను: నిధి అగర్వాల్ నాలుగవ తరగతిలోనే.. ప్రేమలో పడ్డానని నిధి అగర్వాల్ వెల్లడించింది.