‘రౌడీ బేబి..’ రికార్డ్‌..!

  • IndiaGlitz, [Tuesday,November 17 2020]

‘రౌడీ బేబి ...’ అంటూ సాంగ్‌తో ధనుశ్‌, సాయిప‌ల్ల‌వి వెండితెర‌పై చేసిన సంద‌డిని అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేం. ‘మారి2’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమాలో ‘రౌడీ బేబి ...’ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ధనుశ్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘మారి’ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఈ సినిమాలో ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తూ వ‌స్తుంది. భాష‌తో సంబంధం లేకుండా ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఈ పాట‌ను విని ఎంజాయ్ చేయ‌డంతో పాట ఏకంగా వ‌న్ బిలియ‌న్ అంటే అక్ష‌రాలా వంద కోట్ల వ్యూస్ మార్క్‌ను రీచ్ అయ్యింది. ఈ రికార్డ్ సాధించిన తొలి ద‌క్షిణాది పాట ఇదే కావ‌డం వివేషం.

‘రౌడీ బేబి ...’ సాంగ్ రికార్డ్ సాధించ‌డంతో ఆ సంతోషాన్ని ధ‌నుశ్ సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికీ తెలియ‌జేశాడు. ‘‘నా కెరీర్‌లో అనుకోకుండా ఓ మెమొర‌బుల్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. నా ‘కొల‌వెరి ఢీ.. ’ సాంగ్ విడుద‌లైన 9 సంవ‌త్స‌రాల త‌ర్వాత అదే రోజున ‘రౌడీ బేబి ...’ సాంగ్ వంద‌కోట్ల వ్యూస్ మార్కును సాధించ‌డం ఆనందంగా ఉంది. ద‌క్షిణాదిన ఈ రికార్డ్ సాధించిన తొలి పాట ఇదే కావ‌డం గ‌ర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు ధ‌నుశ్.

More News

డిసెంబర్ 6న జీహెచ్ఎంసీ ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఆ చిత్రాన్ని పవన్ సర్ చేయడం చాలా ఆనందాన్నిస్తోంది: చిన్మయి

తానొక సందేశాత్మక చిత్రాన్ని చూశానని.. అది తనకు ఎంతగానో నచ్చిందని సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారం..

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆది సాయికుమార్ హీరోగా ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై

సినిమా రేంజ్‌లో స‌మంత రెమ్యున‌రేష‌న్‌..!

ఇప్పుడు వెండితెర‌పై స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న వారంద‌రూ బుల్లితెర‌పై రియాలిటీ షోస్‌ల‌లో, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న టీవీ షోస్‌ల‌లోనూ న‌టిస్తున్నారు.