వైఎస్ జగన్ పై రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తనదైన మార్క్‌తో.. నిరంతరం సంచలన నిర్ణయాలు, కీలక ప్రకటనలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ పాలనపై రోశయ్య కొన్ని సలహాలు, సూచనలు చేశారు.
రోశయ్య మాటల్లోనే...
"జగన్ ఆలోచనలు అర్థంకావడం లేదు. ఆయన ఆలోచనలు ఏంటి..? ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో తెలియట్లేదు..? ఇవన్నీ తెలియాలంటే కొంత స్పష్టత రావాల్సి ఉంది. జగన్ ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిది. ప్రభుత్వం పొదుపుగా వ్యవహరించాలి. పాలన విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొదుపు చేస్తేనే ప్రభుత్వం కొంత సాఫీగా ముందుకు నడుస్తుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.. ఎస్ జగన్ ప్రభుత్వం అటు కేంద్రంతో సఖ్యతగా లేదని పోనీ విపక్షాలను సైతం కలుపుకుని వెళ్లడం లేదు" అని రోశయ్య వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments