‘హిట్ 2’ నుంచి మెలోడి రొమాంటిక్ వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటూ ..తనదైన క్రేజ్, ఇమేజ్ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఈయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్ అందరి అటెన్సన్ను సంపాదించుకుంది. గురువారం రోజున చిత్ర యూనిట్ ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజైంది. హైదరాబాద్‌లో మూడు కాలేజీలకు చెందిన విద్యార్థుల సమక్షంలో పాటను విడుదల చేశారు.
సిద్ శ్రీరామ్ అద్బుతమైన గొంతు వీనుల విందుగా ఉంది. అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. కూల్ పోలీస్ ఆఫీసర్ కె.డి .. ఆర్యపై ఉన్న ప్రేమను పాట ఎలివేట్ చేస్తుంది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణ కాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ అందించారు. సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
హోమీసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీసర్‌గా అడివి శేష్ కనిపించబోతున్నారు. ఇంకా రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది.
నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com