సమంత అతడితో నటించిన రొమాంటిక్ సీన్లు డిలీట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అఖండ విజయం సొంతం చేసుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ దూసుకుపోతోంది. సీజన్ 1లో తమ సత్తా చాటారు. సీజన్ 2 తో దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా చేశారు. వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ అంటే ఓ బ్రాండ్ లా మారిపోయింది.
ఇదీ చదవండి: పిక్ టాక్: అక్కని మించేలా చెల్లి అందాల షో!
అయితే ఫ్యామిలీ మ్యాన్ 2పై వివాదాలు కూడా అదే స్థాయిలో చెలరేగాయి. శ్రీలంక తమిళులని ఉద్దేశించిన కొన్ని సన్నివేశాలు, సమంత పాత్రపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ అంశాన్ని పక్కన పెడితే తొలిసారి సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ఇది. నెగిటివ్ రోల్ లో నటించడం కూడా ఇదే తొలిసారి.
ఈ వెబ్ సిరీస్ లో షహద్ అలీ అనే నటుడు సాజిద్ పాత్రలో సమంతతో కలసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాడు. షహద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సమంతతో కలసి నటించడం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని తెలిపాడు.
మొదట నన్ను ప్రేక్షకులు సాజిద్ గా నెగటివ్యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానం ఉండేది. కానీ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక ప్రశంసిస్తూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక సీజన్ 2లో తనకు, సమంతకు మధ్య కొన్ని ఇంటిమెంట్ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని కంఫర్మ్ చేశాడు. అయితే రిలీజ్ కు ముందే ఆ సన్నివేశాలని ఎడిటింగ్ లో తొలగించినట్లు షహద్ పేర్కొన్నాడు.
శ్రీలంకన్ రెబల్ మహిళగా సమంత అద్భుతంగా నటించింది. డీగ్లామర్ రోల్ లో సమంత అందరినీ ఆకట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments