జులై 1న విడుదలవుతున్న 'రోజులు మారాయి'
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వరుస బ్లాక్‌బస్టర్స్ కథలతో సూపర్‌డూపర్ సక్సస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా.... మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ-నిర్మాణం లో రూపొందిస్తున్న చిత్రం రోజులు మారాయి. జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నఈ చిత్రంతో మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడు. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం యోక్క ఆడియో కి అనూహ్యమైన స్పందన రావటంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం చేశారు. సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకున U/Aసర్టిఫికేట్ తో జులై 1న విడుదల చేస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహించింది.
ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ... మంచి కథల్ని, మంచి చిత్రాల్ని నిర్మించటంలో నేను ఎప్పూడు ముందుంటాను, అందులో భాగంగానే రోజులు మారాయి చిత్ర నిర్మాణంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భాగమైంది. నిర్మాతల, హీరోల దర్శకుడిగా దూసుకెళ్తున్న మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించారు. జి.శ్రీనివాస రావు నిర్మాత.మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడు. మారుతి కథ లు ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం సోసైటిలో అమ్మాయిలు ఎలా వున్నారు అనేది కథాంశం. ఈచిత్రం యూత్ తో పాటు ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. అన్ని కార్కక్రమాలు పూర్తయ్యాయి. సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ పోందింది. జులై 1న చిత్రం విడుదల అవుతుంది. అని అన్నారు.
చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజశ్వి, ఆలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర,వాసు ఇంటూరి, జబర్దస్త్ అప్పారావు, శశాంక్, రావిపల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసుదనరావు,హర్ష, సంధ్యజనక్ తదితరులు..నిర్మాణ సారధ్యం- గుడ్‌సినిమా గ్రూప్, సహనిర్మాణం-శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్, కథ,స్క్రీన్‌ప్లే- మారుతి, సమర్పణ- దిల్ రాజు , సంగీతం- జె.బి , మాటలు- రవి నంబూరి , దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments