దిల్ రాజు చేతుల మీదుగా 'రోజులు మారాయి' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,June 19 2016]
దిల్ రాజు సమర్పణ‌లో మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా జి.శ్రీనివాస‌రావు నిర్మించిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ రోజులు మారాయి. ఈ చిత్రంలో చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ముర‌ళీ కృష్ణ ముడిదాని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జె.బి సంగీతం అందించిన రోజులు మారాయి ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌రిగింది. దిల్ రాజు రోజులు మారాయి ఆడియో సి.డీని ఆవిష్క‌రించ‌గా..డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి ధియేట‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ...మారుతి ఓరోజు ఈ సినిమా క‌థ గురించి చెప్పాడు. స‌క్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్న మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించాను. ఇటీవ‌ల సినిమా చూపించారు. మారుతి ఏదైతే అనుకున్నాడో దానిని డైరెక్ట‌ర్ ముర‌ళీ 100% స్ర్కీన్ పైకి తీసుకురావ‌డంతో డైరెక్ట‌ర్ గా స‌క్సెస్ అయ్యాడు. మ‌నం అనుకున్న క‌థ‌ని స్ర్కీన్ పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ఇక న‌టీన‌టులు గురించి చెప్పాలంటే...చేత‌న్ బాగా న‌టించాడు. అలాగే పార్వ‌తీశం, తేజ‌స్వి, కృతిక అంద‌రూ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు బాగా న‌టించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జె.బి మంచి ట్యూన్స్ అందించాడు. జె.బి మా బ్యాన‌ర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు వ‌ర్క్ చేయ‌లేదా అనిపిస్తుంది. ఇంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ జె.బి ఇప్ప‌టి వ‌ర‌కు మా బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేయక‌పోవ‌డం నా త‌ప్పే. త్వ‌ర‌లోనే మా బ్యానర్ లో జె.బి వ‌ర్క్ చేస్తాడు. మారుతి రోజులు మారాయి అనే మంచి ఎంట‌ర్ టైన‌ర్ అందిస్తున్నాడు. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల నిడివి గ‌ల ఈ మూవీ జులై 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఆల్ ది బెస్ట్ టు రోజులు మారాయి టీమ్ అన్నారు.
డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ...ఒక చిన్న క‌థ ఇది. నేను చెప్పిన ఐడియాను రైట‌ర్ ర‌వి, డైరెక్ట‌ర్ ముర‌ళీ అద్భుతంగా మ‌లిచి తెర‌కెక్కించారు. డైరెక్ట‌ర్ ముర‌ళీ 24 గంట‌లు సినిమా బాగా రావాల‌ని క‌ష్ట‌ప‌డ్డాడు. అలాగే రైట‌ర్ ర‌వి మంచి డైలాగ్స్ రాసాడు. జె.బి గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎప్పుడూ ఇస్తున్న‌ట్టుగానే ఈసారి కూడా మంచి మ్యూజిక్ అందించాడు. చేత‌న్ కొత్త కుర్రాడు అయినా చాలా బాగా న‌టించాడు. ఆడియ‌న్స్ మీరు ఈ న‌లుగుర్ని రెండున్న‌ర గంట‌లు చూడ‌గ‌ల‌మా అనే సందేహం పెట్టుకోవ‌ద్దు. ఖ‌చ్చితంగా అంద‌ర్ని అల‌రిస్తారు. దిల్ రాజు గారు సినిమా చూసి చాలా బాగుంది అని చెప్ప‌డంతో మాకు ఎంతో ధైర్యం వ‌చ్చింది. నా ఫ్రెండ్ శ్రీనివాస‌రావు నిర్మించిన ఈ చిత్రం స‌క్సెస్ అవ్వాల‌ని.. అంద‌రూ మా టీమ్ ని ఆశీర్వ‌దించి విజ‌యం అందించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి మాట్లాడుతూ...రోజులు మారాయి ట్రైల‌ర్ చూస్తుంటే ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయి అనిపిస్తుంది. పార్వ‌తీశం కామెడీ చాలా బాగా చేస్తున్నాడు. అలాగే జె.బి. అందించిన పాటలు బాగున్నాయి. రోజులు మారాయి టీమ్ అంద‌రికీ బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ...ఈ సినిమా క‌థ‌ను భ‌లే భ‌లే మ‌గాడివోయ్ క‌న్నా ముందు మారుతి గారు త‌యారు చేసుకున్నారు. రియ‌ల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. త‌న కోసం రాసుకున్న క‌థ‌ను నాకు ఇచ్చి న‌న్ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన మారుతి గార్కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను అన్నారు.
హీరోయిన్ తేజ‌స్వి మాట్లాడుతూ... సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హిస్తున్న‌దిల్ రాజుకి థ్యాంక్స్. కేరింత తో మా అంద‌రి కెరీర్ స్టార్ట్ అయ్యింద‌ని చెప్ప‌చ్చు. దిల్ రాజు అంటే ఫ్యామిలీ మూవీసే చేస్తారు అని అంటారు కానీ..క‌థ న‌చ్చితే ఎలాంటి సినిమా అయినా..అందులో ఎవ‌రు న‌టించినా దిల్ రాజు ఎంక‌రేజ్ చేస్తారు. చిన్న‌ప్పుడు సినిమా చూస్తే అన్ని విష‌యాలు మ‌రిచిపోయేదాన్ని. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు కూడా అలాంటి అనుభూతే క‌లిగింది అన్నారు.
పార్వ‌తీశం మాట్లాడుతూ...న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హిస్తున్న దిల్ రాజు గార్కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. రైట‌ర్ ర‌వి, డైరెక్ట‌ర్ ముర‌ళీ గారు, ల‌క్కీ ఈ ముగ్గురు లేక‌పోతే ఈ సినిమా లేదు. మా ప్ర‌య‌త్నానికి విజ‌యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో చేత‌న్ మాట్లాడుతూ...సినిమా ఫీల్డ్ అంటే ఎవ‌రైనా వ‌ద్దంటారు. కానీ...న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హించిన మా డాడీకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఫ‌స్ట్ టైమ్ నేను, మా డాడీ మారుతి గార్నిక‌లిసిన‌ప్పుడు మీ అబ్బాయిని నా ద‌గ్గ‌ర వ‌దిలేయండి. కెరీర్ మొత్తం నేను సెట్ చేస్తాను అన్నారు. అన్న‌ట్టుగానే...న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హిస్తున్న మారుతి గార్కి, దిల్ రాజు గార్కి థ్యాంక్స్. స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర ఏక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే ఈ సినిమాకి వ‌ర్క్ చేస్తూ చాలా విష‌యాలు నేర్చుకున్నాను. పార్వ‌తీశం రెండు నిమిషాల సీన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకోవ‌డం చూసి నేను చాలా ఇన్ స్పైయ‌ర్ అయ్యాను. ఈ సినిమా మా టీమ్ అంద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది అనుకుంటున్నాను అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో హీరో చేత‌న్ కి న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇచ్చిన గురువు స‌త్యానంద్ గార్ని స‌త్క‌రించారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్, నిర్మాత రాధా మోహ‌న్, ర‌చ‌యిత‌ డార్లింగ్ స్వామి, గీత ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్, హీరో హ‌వీస్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

More News

ఆ డైరెక్ట‌ర్ తో మ‌ళ్లీ మూవీ చేస్తున్న నితిన్

అ ఆ సినిమాతో ఘ‌న విజ‌యం సాధించి...ముఖ్యంగా ఓవ‌ర్ సీస్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించాడు నితిన్.దీంతో త‌న ఇమేజ్ ని మ‌రింత పెంచుకునేలా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.

బిచ్చ‌గాడు కి హెల్ప్ చేసిన మ‌హేష్ బాబు..

విజ‌య్ ఆంటోని, స‌త్న టైట‌స్ జంట‌గా ఫాతిమా విజ‌య్ ఆంటోని నిర్మించిన త‌మిళ చిత్రం పిచ్చైకార‌న్. ఈ చిత్రాన్ని చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి తిరుమల‌ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ పై బిచ్చ‌గాడు టైటిల్ తో రిలీజ్ చేసారు.

బోయ‌పాటి నెక్ట్స్ మూవీలో అత‌ను న‌టిస్తున్నాడా..

స‌రైనోడు సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన బోయ‌పాటి శ్రీను నెక్ట్స్ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

మార్ష‌ల్ ఆర్ట్ నేర్చుకుంటున్న చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్, సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ధృవ‌’. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు.

స్పెషల్ సాంగ్ చేస్తుంది...అందుకేనా..ఏమో?

మెగాపవర్ స్టార్ రాంచరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ధవ.తమిళ చిత్రం తనీ ఒరువన్ కు రీమేక్గా ఈ చిత్రం రూపొందుతోంది.