జూన్ 11న ఆడియో విడుదలవుతున్న 'రోజులు మారాయి'
- IndiaGlitz, [Sunday,June 05 2016]
ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వరుస బ్లాక్‌బస్టర్స్ కథలతో సూపర్‌డూపర్ సక్సస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా....
మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ-నిర్మాణం లో రూపొందిస్తున్న చిత్రం సరోజులు మారాయిస. జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నఈ చిత్రంతో మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం యోక్క మెదటి లుక్ కి అనూహ్యమైన స్పందన రావటంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఈరోజుల్ల, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం చేశారు. ఈ ఆడియోని జూన్ 11న ప్రముఖ సిని పెద్దల సమక్షంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 7 న విడదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.
ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ... మంచి కథల్ని, మంచి చిత్రాల్ని నిర్మించటంలో నేను ఎప్పూడు ముందుంటాను, అందులో భాగంగానే రోజులు మారాయి చిత్ర నిర్మాణంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భాగమైంది. నిర్మాతల, హీరోల దర్శకుడిగా దూసుకెళ్తున్న మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించారు. జి.శ్రీనివాస రావు నిర్మాత.మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడు. ఫస్ట్ లుక్ కి చాలా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావటం విశేషం. మారుతి కథ లు ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మంచి యూత్ ట్యూన్స్ తో రింగ్ ట్రింగ్ అంటూ కుర్రకారు మెబైల్స్ లో రింగ్ టోన్ గా మారిన జె.బి అందించిన ఆడియో ని జూన్ 11 న విడదల చేస్తున్నాము. శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్కక్రమాలు పూర్తిచేసి జులై 7న విడుదల చేయనున్నాము. అని అన్నారు.
చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజశ్వి, ఆలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర,వాసు ఇంటూరి, జబర్దస్త్ అప్పారావు, శశాంక్, రావిపల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసుదనరావు,హర్ష, సంధ్యజనక్ తదితరులు..