‘రోజా ప్రిన్సిపాల్.. జగన్ డీన్.. పీఈటీ పృథ్వీ!!’
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంట్రా బాబూ.. ఇంత తిక్క తిక్కగా ఉంది టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే.. అసలు విషయం.. టైటిల్ అర్థం తెలియాలంటే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా పోస్ట్ చూడాల్సిందే మరి. ఇంతకీ ఆయన చేసిన పోస్ట్ ఏంటి..? ఎందుకిలా పోల్చారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే రోజా, మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు అడ్డు అదుపూ లేకుండా మాట్లాడేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ముగ్గురికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో మీడియా ముందుకు రావడం.. బూతులు మాట్లాడటం తగ్గించేశారనే వార్తలు కూడా గుప్పుమన్నాయ్. అయితే ఈ వ్యవహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బుచ్చయ్య సోషల్ మీడియాలో చమత్కారంతో ఆసక్తికర పోస్ట్ చేశారు.
తాడేపల్లిలో అశ్లీల భాష యొక్క పాఠశాల ఉందని.. ఇందులో షార్ట్ టర్మ్ కోర్సు కూడా ఉందని.. ‘సాక్షి’ యందు ఆన్‌లైన్ సదుపాయం కూడా ఉందని పేర్కొన్నారు. అంతటితో ఆగని ఆయన సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే రోజా, పృథ్వీలు ప్రస్తావన తెస్తూ తనదైన శైలిలో పంచ్‌లు, చమత్కారంతో పోస్ట్‌లు రాసుకొచ్చారు.
అశ్లీల భాష యొక్క పాఠశాల (షార్ట్ టర్మ్ కోర్సు) : తాడేపల్లి
డీన్ - సీయం జగన్ గారు (అన్ని విభాగాల్లో నైపుణ్యం ఈయన సొంతం)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - విజయసాయిరెడ్డి (పారదర్శకంగా లెక్కలు చూపడంలో ఈయన అనుభవజ్ఞులు)
ప్రిన్సిపాల్ - రోజా గారు (తిట్లలో అనేక సంవత్సరాల ప్రావీణ్యం, అనుభవం కలదు)
హెచ్ఓడీ - కొడాలి నాని (నీ అమ్మమొగుడు అనే సర్టిఫికెట్ కోర్సు హోల్డర్)
ప్రొఫెసర్ - అనిల్ యాదవ్ (బుల్లెట్లు దింపడంలో అనుభవశీలి)
డ్యాన్స్ మాస్టర్ - అంబటి రాంబాబు (నాట్యం చేయడంలో దిట్ట. మరియు అనేక మందితో నాట్యం చేసిన అనుభవం)
గెస్ట్ ఫ్యాకల్టీ - బొత్స సత్యనారాయణ (బహుభాషా కోవిదుడు. ఏ విషయం అయినా స్పష్టంగా మాట్లాడే అనుభవం ఈయన సొంతం)
పీఈటీ - పృథ్వి రాజ్ (ఏదైనా సరే వెనక నుండి ఆకర్షించడం ఈయన ప్రత్యేకత)
మ్యాథ్స్ హెడ్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (తప్పుడు లెక్కని కరెక్ట్ గా చెప్పడంలో ఈయన మేధస్సు అమోఘమైనది)
పరీక్ష విధానం - ప్రతిపక్ష పార్టీని తిట్టడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులుకు మాత్రమే.. అని బుచ్చయ్య తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కాగా ఈ పోస్ట్‌ను టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తుండగా.. మరోవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మరి ఇందుకు కౌంటర్‌గా వైసీపీ ఏం చేయబోతోంది..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com