Bandla Ganesh:రోజా ఓ ఐటెం రాణి.. పులుసు పాప.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒక ఐటెమ్ రాణి.. పులుసు పాప అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు వస్తుందో రాదో కూడా తెలియదన్నారు. రేవంత్ రెడ్డి ఫైటర్.. జగన్ ఆక్సిడెంట్ సీఎం అని విమర్శలు చేశారు. నాన్న గారు చనిపోతేనో.. నాన్న గారి వారసత్వంతోనో.. సీఎం అయిన వ్యక్తి కాదని కౌంటర్ ఇచ్చారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు పాపవి అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాది కాదన్నారు. ఆమె రేపో.. మాపో మాజీ అవుతారు.. ఆ మాజీ.. తెలంగాణలోని ఈ మాజీ.. కలిసి.. జబర్దస్త్‌లు చేసుకోండని సూచించారు.
అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పైన ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తండ్రిపేరు అడ్డు పెట్టుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, కేసీఆర్ కుమారుడిగా తప్ప కేటీఆర్‌కి ఏ గుర్తింపు లేదన్నారు. రేవంత్ రెడ్డి పోరాట యోధుడు, బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై లాగా ఉంటుందని..రేవంత్ సీఎం కావడంతో కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని విమర్శించారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్‌కౌంటర్ చేయించే వాళ్లు.. రాళ్లతో కొట్టి చంపించేవాళ్లు అన్నారు. కానీ తాము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం కాబట్టి చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని.. అమెరికాలోనే సెటిల్ అవ్వండని సూచించారు. కేటీఆర్ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందన్నారు. అవినీతి చేసిన ఎవరినీ కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు.
అలాగే కేటీఆర్ 'ఛలో మేడిగడ్డ' బ్యారేజీకి పిలుపు ఇవ్వడంపైనా గణేష్ మండిపడ్డారు. మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా..? అంటూ సెటైర్లు వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో మేడిగడ్డ కూలిపోతే లక్షలాది మంది ప్రజల చావుకు.. కోట్లాది రూపాయల ఆస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ లేఖ రాసి ఇస్తారా..? అని సవాల్ విసిరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com