నిరూపిస్తే రాజీనామా చేస్తా..: రోజా సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు, జిల్లా ప్రజలు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు కూడా ఆయన పర్యటనకు సంబంధించిన అనుమతులను వెనక్కి తీసుకుని.. ఉద్రిక్త పరిస్థితులు.. టెన్షన్ వాతావరణం, హై డ్రామా మధ్య బాబును విశాఖ నుంచి హైదరాబాద్ ఫ్లైట్‌లో పంపించేశారు. అయితే.. పులివెందుల రౌడీలు, వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు, ఆఖరికి చంద్రబాబు కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించి సవాల్ విసిరారు.
స్వాగతం ఎలా పలుకుతారు!?
‘చంద్రబాబును రౌడీలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. చంద్రబాబును అడ్డుకుంది ఉత్తరాంధ్ర ప్రజలేనని, అక్కడి అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబుకు స్వాగతం ఎలా పలుకుతారు?. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదు. గతంలో నేను మహిళా సదస్సుకు వెళ్తే ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని రోజంతా తిప్పి తిప్పి హైదరాబాద్ పంపించారు. ఆ రోజు కనిపించని రాజ్యాంగం టీడీపీ నేతలకు ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ..వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చంద్రబాబుకు ఏవిధంగా స్వాగతం పలుకుతారు?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పెద్ద మనిషికి ఆ మాత్రం కామన్సెన్స్ కూడా లేదా ..?’ అని రోజా సూటి ప్రశ్నల వర్షం కురిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments