హాట్ టాపిక్‌గా రోజా, బండ్ల గణేష్ ఫోటో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, నిర్మాత బండ్ల గణేష్.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఇప్పుడీ ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను కూడా పెట్టారు. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని బండ్ల గణేష్ ఆకాంక్షించారు. ‘‘చాలాకాలం తర్వాత రోజా గారిని కలిశాను. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలి. ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా.. కొద్ది నెలల క్రితం ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్లో రోజా, బండ్ల గణేష్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. వారసత్వ రాజకీయాలపై ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చలో రోజా ఫోన్లైన్లో మాట్లాడుతూ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు చాలా తక్కువని రోజా విమర్శించారు. ఇదే చర్చా కార్యక్రమంలో బండ్ల గణేష్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో రోజా ఫోన్లో మాట్లాడుతూ, మహామహులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారన్నారు. కానీ, ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు, అల్లుడు తదితరులంతా కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను రోజా కాస్త అమర్యాదగా సంభోదించడంతో బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. రోజాది గోల్డెన్ లెగ్ అంటూ రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించారంటూ ఆవేశంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన రోజా.. అసందర్భ ప్రేలాపన ఆపకపోతే పళ్లు రాలగొడతా అంటూ ఫైర్ అయ్యారు. బండ్ల గణేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. ‘నీ పళ్లు రాలిపోతాయి’ అంటూ రోజాపై మండిపడ్డారు. ఆ తరువాత రోజా, బండ్ల గణేష్ ఎక్కడా కలిసింది లేదు. తాజాగా కలిసి సరదాగా ఫోటోకి ఫోజులివ్వడంతో పాటు ఆమె కెరీర్లో ఉన్నతిని కోరుకుంటూ బండ్ల ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com