రొమాంటిక్ థ్రిల్లర్ లో రోహిత్....

  • IndiaGlitz, [Friday,January 06 2017]

విభిన్న‌మైక క‌థ‌లు, క్యారెక్ట‌ర్స్‌తో వ‌రుస సినిమాల‌ను చేస్తున్న హీరో నారా రోహిత్ ఫిభ్ర‌వ‌రిలో ఓ కొత్త సినిమాను చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం నారా రోహిత్ జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. ఫిభ్ర‌వ‌రిలో సినిమా స్టార్ట్ కావ‌డానికి ముందు ఎంత వ‌ర‌కు వీలైతే అంత మేర బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నాడ‌ట రోహిత్‌. ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం నారా రోహిత్ క‌థ‌లో రాజ‌కుమారి సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకంది. ఈ ఏడాది నుండి ఏక‌బిగిన సినిమాలు చేయ‌కుండా ఓ ప్లానింగ్ ప్ర‌కారం ఓ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మ‌రో సినిమాను స్టార్ట్ చేయాల‌ని రోహిత్ అనుకుంటున్నాడట‌.