'రోగ్' ట్రైలర్ రివ్యూ
- IndiaGlitz, [Thursday,March 02 2017]
ఐ హేట్ గర్ల్స్..
మీ అమ్మాయిలకిదే కామన్ కదా..ఒకరేమో బకరా..ఒకరు స్టాండ్‌బై
అమ్మా..ఒక్కడ షో రూమ్ బట్టలేం లేవ్..అన్నీ సెకండ్ హ్యండే..
ఎవరైనా నా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతా..
ఈ డైలాగ్స్ విన్నా,..చదివినా..కాస్తా తేడాగానే అనిపిస్తుంది..కదూ..ఇక్కడ తేడా అంటే కామన్ కుర్రాడులా కాకుండా మాస్ కుర్రాడు మాట్లాడితే ఉండేలా అనిపిస్తాయి...
ఇలా డైలాగ్స్ రాయగలిగే డైరెక్టర్ పూరి మాత్రమే..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్, మన్నారా చోప్రా, ఎంజలినా క్రిజిలెంకీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'రోగ్' త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మరో చంటిగాడు ప్రేమకథ అనే క్యాప్షన్‌తో విడుదలకు సిద్ధమైన ఈ లవ్‌స్టోరీ. ఇందులో హీరో క్యారెక్టర్ ఇడియట్లో రవితేజ అట్యిట్యూడ్‌ను మించేలా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే పూరి తన స్టయిల్లో ఓ లవ్‌స్టోరీని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోగ్‌లో పూరి గ్లామర్ డోస్ ఇంకాస్తా పెంచాడు. హీరో ప్రెజెంటేషన్..విలన్‌కు, హీరోకు మధ్య హీరోయిన్ వల్ల జరిగే పోరాటం..
నువ్వు నా కొడుకువి కావు..నేను నీ తండ్రినీ కాను.. అనే డైలాగ్‌తో తండ్రి, కొడుకుల మధ్య స్టోరీ ఉందని పూరి ఈ ట్రైలర్లో చూపించాడు. ముఖేష్ సినిమాటోగ్రఫీ చాలా నీట్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించాడు. సునీల్‌కశ్యప్ మ్యూజిక్ బావుంది.
పూరి 'రోగ్' టైటిల్‌తోనే తన హీరో ఎలాంటివాడో, ఎంత మాసీగా ఉంటాడో చెప్పకనే చెప్పాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఇషాన్‌కు రోగ్ మంచి ఫ్లాట్ అవుతుందనడంలో సందేహం లేదు..మరి పూరి ఈ సినిమాలో ఏం చెప్పాడనడం కంటే సినిమాను ఎంత గ్రిప్పింగ్‌గా నడిపించాడనేదే ముఖ్యంగా చూడాలి..ఈ సినిమాకు మరో చంటిగాడి ప్రేమకథ అనే క్యాప్షన్ పెట్టడం ద్వారా ఇడియట్ వంటి సూపర్‌హిట్ సినిమాతో ఆడియెన్స్ పోల్చుకుంటారేమో...