Download App

Rogue Review

పూరి జ‌గ‌న్నాథ్‌..తెలుగు చిత్ర‌సీమ‌లో ప‌రిచయం అక్క‌ర్లేని పేరున్న డైరెక్ట‌ర్‌. బద్రి, ఇడియ‌ట్‌, పోకిరి, టెంప‌ర్ ఇలా ఒక‌టేమిటి హీరో క్యారెక్ట‌ర్స్‌ను స‌రికొత్త రీతిలో ఎలివేట్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు పూరి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రాంచ‌ర‌ణ్‌ను హీరోగా చిరుత చిత్రం ప‌రిచ‌యం చేసిన పూరి, ఇప్పుడు ఇషాన్ అనే మ‌రో హీరోను తెలుగు ప‌రిచయం చేస్తున్న చిత్ర‌మే రోగ్‌. నెగ‌టివ్ టైటిల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే పూరి రోగ్ అనే నెగ‌టివ్ టైటిల్ పెట్టినా మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. మ‌రి ఈ రోగ్ ప్రేమ క‌థేంటి? ప‌్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే క‌థ తెలుసుకుందాం....

క‌థ:

సినిమా కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో స్టార్ట్ అవుతుంది. కోల్‌క‌త్తా క‌మీష‌న‌ర్ కుమార్తె అంజ‌లి(ఏంజెలా) ప్రేమించిన యువ‌కుడు(రోష‌న్‌) చాలా నిక్క‌చ్చిగా మాట్లాడుతుంటాడు. అంద‌రూ అత‌న్ని రోగ్ అని అంటుంటారు. అంజ‌లి కూడా రోష‌న్ కంటే మంచి సంబంధం వ‌చ్చింద‌ని పెళ్ళి చేసుక‌ని వెళ్ళిపోతుంది. పెళ్ళికి వెళ్ళిన ఇషాన్ అక్క‌డ గొడ‌వ‌ప‌డి జైలు శిక్ష‌ను అనుభ‌విస్తాడు. ఈ గొడ‌వ‌లో రోష‌న్ ఓ కానిస్టేబుల్‌(స‌త్య‌) కాళ్ళు విర‌గకొడ‌తాడు. అంజ‌లి మోసం చేయ‌డంతో రోష‌న్‌కు అమ్మాయిలంటే అస‌హ్యం ఏర్ప‌డుతుంది. జైలు నుండి వ‌చ్చిన రోష‌న్‌ను తండ్రి కూడా ఇంట్లో నుండి వెళ్ళ‌గొడ‌తాడు. త‌న కార‌ణంగా కానిస్టేబుల్ కుటుంబం ఇబ్బందులు ప‌డుతుంద‌ని తెలుసుకున్న రోష‌న్ వారి కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌తాడు. కానిస్టేబుల్ చెల్లెలు మ‌రో అంజ‌లి(మ‌న్నారా చోప్రా), ముందు రోష‌న్‌తో గొడ‌వ ప‌డుతుంది. త‌ర్వాత రోష‌న్ మంచి మ‌న‌సును అర్థం చేసుకుని అత‌న్ని ప్రేమిస్తుంది. క‌థ ఇలా సాగిపోతున్న స‌మ‌యంలో అంజ‌లి(మ‌న్నారా చోప్రా)ను ప్రేమించిన ఓ సైకో(అనూప్ సింగ్‌) జైలు నుండి త‌ప్పించుకుంటాడు. అంజ‌లిని ప్రేమించ‌మ‌ని వేధిస్తాడు. రోష‌న్..అంజ‌లికి స‌పోర్ట్‌గా నిల‌బ‌డ‌తాడు. అప్పుడు రోష‌న్‌కు, సైకోకు మ‌ధ్య ఎలాంటి వార్ జ‌రుగుతుంది. అంజ‌లి కోసం సైకో ఏం చేస్తాడు?  చివ‌ర‌కు రోష‌న్ క‌థ ఏ మ‌లుపు తిరుగుతుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్:

- ఇషాన్, అనూప్ సింగ్ న‌ట‌న‌
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

- ద‌ర్శ‌క‌త్వం
- క‌థ‌, క‌థ‌నం
- మ్యూజిక్‌
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌

విశ్లేష‌ణ:

కొత్త న‌టుడు ఇషాన్ తొలి చిత్రం చేస్తున్న‌ట్టు కాకుండా ఓ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న హీరోలా న‌టించాడు. ఇషాన్ మంచి హైట్‌, హైట్‌కు త‌గ్గ ప‌ర్స‌నాలిటీతో హ్యండ్స‌మ్‌గా క‌న‌ప‌డ్డాడు. ఇషాన్‌లాంటి నటుడు ఫైట్స్ చేసినా న‌మ్మ‌బుద్ద‌య్యేలా ఉంటుంది. డైలాగ్ డెలివ‌రీ, లుక్స్ అన్నీ పూరి హీరోల‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌తో సినిమా ఉండ‌టం పెద్ద ప్ల‌స్ అయ్యింది. ఐటెంసాంగ్స్‌లో న‌టించిన ఏంజెలా హీరోయిన్ అయినా తానేం తీసిపోనంటూ ముందుగా వ‌చ్చే పాట‌లో అందాల‌ను వీలైనంత‌గా ఆర‌బోసింది. ఇషాన్‌, ఏంజెలా మ‌ధ్య వ‌చ్చే సాంగ్ రొమాన్స్‌లోని హ‌ద్దులు దాటేసింది అనాలి. అలాగే మ‌న్నారా చోప్రా కూడా పిక్క‌లు చూపిస్తూ వీలైనంత క‌న్నుల పండుగ చేసింది. ఇషాన్‌, మ‌న్నారా చోప్రా మ‌ధ్య సెకండాఫ్‌లో వ‌చ్చేసాంగ్ కూడా మంచి రొమాంటిక్‌గా ఉంది. హీరోయిన్స్ ఇద్ద‌రూ సొగ‌స‌లు చూపించ‌డంలో పెట్టిన శ్ర‌ద్ధ న‌ట‌న‌లో క‌న‌ప‌ర‌చ‌లేద‌ని తెలుస్తుంది. ఇక హీరో త‌న మాజీ ల‌వ‌ర్ ఇంటికి రావ‌డం, ఆమె భ‌ర్త‌, తండ్రి పెద్ద పోలీస్ ఆఫీస‌ర్స్ అయినా వారి ముందే ఆమెపై కోపం ప్ర‌ద‌ర్శించ‌డం విడ్డూరంగా అనిపిస్తాయి. పూరి హీరో ఎంత ర‌ఫ్ అయినా ఇంత ర‌ఫ్ ఓవ‌ర్ అనిపిస్తుంది. ఇక హీరో త‌ల్లిదండ్రులు, హీరోయిన్ అన్న పాత్ర‌ల‌కు క‌థ‌లో పెద్ద‌గా స్కోప్ లేదు..క‌న‌ప‌డ‌దు.. ఇక సైకో సైక‌స్య అంటూ సైకో పాత్ర‌లో న‌టించిన అనూప్ సింగ్ న‌ట‌న సూప‌ర్బ్‌. హీరోయిన్‌ను ప్రేమిస్తున్నానంటూ విల‌న్ ఆమె వెంట‌ప‌డ‌టం, ఆమెను వేధించే సంద‌ర్భంలో మంచి న‌ట‌న‌ను చూపాడు అనూప్‌. అలాగే హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆమె మేన‌ల్లుడు మాట్లాడే స‌న్నివేశం కూడా సైకో ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌నే దాన్ని చ‌క్క‌గా ప్రొట్రేట్ చేశాడు. పూరి హీరోనే కాదు, విల‌న్ కూడా తేడాగాడే అని అనూప్ న‌ట‌నతో తెలుస్తుంది. హీరో, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. హీరో ఇషాన్, విల‌న్ అనూప్ న‌ట‌న లేకుంటే సినిమా చూడ‌టం మ‌రీ క‌ష్ట‌మ‌య్యేది. మిగిలిన పాత్ర‌ధారులంతా పూరి గ‌త చిత్రాల్లో క‌న‌ప‌డిన‌ట్టు ఈ చిత్రంలో కూడా క‌న‌ప‌డింది. కామెడి కోసం చేసిన అలీ ట్రాక్ న‌వ్వించ‌దు. అలీ కామెడి పార్ట్ ఏదో పోకిరి సినిమాకు సీక్వెల్‌లా అనిపించింది. బిచ్చ‌గాడులా అలీ చేసిన కామెడి న‌వ్వు తెప్పించదు. ఇక టెక్నిక‌ల్ విషయాల‌కు వ‌స్తే..ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం ఏమైంది అనిపిస్తుంది. పోకిరి, బ‌ద్రి, టెంప‌ర్‌, ఇడియ‌ట్..ఈ చిత్రాల‌ను డైరెక్ట్ చేసింది పూరియేనా అనే డౌట్ కూడా వ‌చ్చేస్తుంది. పూరి త‌న గ‌త చిత్రాల్లాగానే మూస విధానంలో త‌న‌కు తోచిన విధంగా ల‌వ్‌స్టోరీనీ రాసేసుకున్నాడు. ఇలాగైతే పూరికి కష్ట‌మే. ఇక సునీల్ క‌శ్య‌ప్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగ‌తి స‌రేస‌రి. ఏమాత్రం మెప్పించ‌వు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రోగ్ సినిమాకు మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థ అని ట్యాగ్‌లైన్ పెట్టి, నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మంచి ల‌వ్‌స్టోరీ అని చెప్పాడే కానీ..సినిమాలో అంత విష‌యం లేద‌ని తెలుస్తుంది.ఇడియ‌ట్ సినిమా టేకింగ్ మ‌న‌కు ఏ మ‌చ్చుక్కు కూడా క‌నిపించదు.

హీరో త‌ల్లి హీరో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కామెడి చేసేసి వెళ్ళిపోవ‌డ‌మేటోన‌ని ఓ సీన్‌లో అనిపిస్తుంది. హీరో తండ్రి కొడుకు గురించి తెలిసి కూడా త‌న‌ను ఇంట్లో నుండి సిల్లీగా వెళ్ల‌గొట్టడ‌మేంటో మ‌రి. అలాగే బొమ్మ‌ను పెట్టి అలీ చేసిన కామెడి గ‌త్త‌ర గ‌త్త‌రయ్యింది. భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం, ఆర్ట్ వ‌ర్క్‌, జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ వ‌ర్క్ అంతా వృథాయే. మొత్తం మీద పూరి త‌న ఓల్డ్ మార్క్ మాస్ క‌థ‌ల‌నే అటు ఇటు చేసి ల‌వ్‌స్టోరీ అంటూ తెర‌కెక్కించేశాడు. పూరి సినిమాల‌ను అభిమానించే ప్ర‌క్ష‌కులు సినిమాను ఒక‌సారి చూడొచ్చు అంతే..

బోట‌మ్ లైన్: రోగ్‌... పూరి మార్కు బోరింగ్ ల‌వ్‌స్టోరీ

Rogue English Version Movie Review

Rating : 2.5 / 5.0