అభిమానులు సమక్షంలో ఘనంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈరోజు(మే 20న) తన పుట్టినరోజు వేడుకలను జూబ్లీ హిట్స్ లోని మోహన్ బాబు నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ `అభిమానులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంది నన్ను విష్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థాంక్స్.
ఈ ఏడాది నేను మూడు చిత్రాల్లో నటించబోతున్నాను. అందులో సాగర్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న సీతా మహాలక్ష్మి` (మద్రాస్ ర్యాంబో క్యాప్షన్) చిత్రాన్ని నేనే నిర్మాతగా నిర్మంచబోతున్నాను. చాలా మంచి కథ. ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాత ఓ చిత్రం, ఎం.అచ్చిబాబు సమర్పణలో ఎస్.ఎన్.ఆర్.ఫిలింస్ ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్ బ్యానర్స్ పై ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.లక్ష్మీ కాంత్ నిర్మాతలుగా అజయ్ అండ్రూస్ నౌతాక్కి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాను.
ఈ మూడు చిత్రాలు వేటికవే డిఫరెంట్ గా ఉంటూ అన్నీ వర్గాలను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ ఏడాది సీతామహాలక్ష్మి చిత్రంతో నిర్మాత మారుతున్నాను. నేను సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాను. అందరి సపోర్ట్ తో అందరికీ నచ్చేలా సినిమాలు చేస్తానని తెలియజేస్తున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com