చైనాలో కరోనా వ్యాప్తి కట్టడికి రంగంలోకి రోబోలు!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మమమ్మారి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే 200 పైచిలుకు దేశాలు దాటేసిన ఈ వైరస్‌తో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పిట్టలు రాలినట్లు జనాలు మృత్యు బారిన పడి వాలిపోతున్నారు. అసలు వారిని పాతిపెట్టడానికి జనాలు కరువు రావడంతో సామూహికంగా ఒకేసారి పెద్ద గొయ్యి తీసి అందులో పడేస్తున్నారంటే పరిస్థితి ఎంత అల్లకల్లోల్లంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం నిర్లక్ష్యం.. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటమే అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చూస్తే ఇక మాటలుండవ్..
ఇక చైనా విషయానికొస్తే.. ఇప్పటి వరకూ చైనాలో ఎంతమంది చనిపోయారో.. ఎంత మంది బాధితులు అనేది లెక్కల్లో తేలలేదు. ఒకవేళ అధికారిక ప్రకటనలు వచ్చినా దాన్ని నమ్మే పరిస్థితులు ప్రపంచం లేదు. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తున్నప్పటికీ చైనా కావాల్సిందే ఇలా చేస్తోందో లేకుంటే ఇంకేమైనా కారణాలుంటున్నాయో తెలియట్లేదు కానీ.. ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికీ అదే గబ్బిలాలు, మాంసం అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం. ఇంత జరిగినప్పటికీ చైనాలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
రంగంలోకి దిగిన రోబోలు..
మనిషి తుమ్మినా, దగ్గినా.. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా.. లిఫ్ట్ బటన్ ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒకప్పుడు తుమ్మితే సత్యం అనే వాళ్లు.. ఇప్పుడు ఇంకేదేదో అనేస్తున్నారు.!. ఈ క్రమంలో చైనాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు ఇలా అత్యవసర సిబ్బందికి ఫుడ్ తయారు చేయడానికి.. అందించడానికి కూడా ఎవరూ సాహసించట్లేదు. వస్తే ఎక్కడ వైరస్ ఉందో..? ఎక్కడ లేదో అర్థం కావట్లేదు. దీంతో ఏం చేయాలా..? అని ఆలోచనలో పడిన చైనా.. మరోసారి తన మేదస్సుకు పనిపెట్టిన రోబోలను రంగంలోకి దింపింది. ఇది నిజంగా చాలా మంచి పనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించొచ్చు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. రోబోలే వంట చేసి.. రోడ్డు మీదే ప్రయాణించి.. నేరుగా ఆస్పత్రులకే వెళ్లి డెలివరీ చేసి వస్తున్నాయ్. అంటే.. జనాలు లేని లోటును రోబోలు భర్తీ చేశాయన్న మాట. దీనిపై నెట్టింట్లో తెగ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చైనా మొదట్లోనే ఇలాంటి పనులు చేసుంటే పరిస్థితి చేయిదాటిపోయేది కాదని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.
#ChinaStory To reduce the risk of infection, these #robots replaced people to cook and deliver food. #coronavirus #Covid_19 pic.twitter.com/NMw0b9Z1lB
— China Daily (@ChinaDaily) April 11, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout