రోబో 2.0 లో టాలీవుడ్ స్టార్ హీరో...!

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం రోబో 2.0 ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీలో అమీ జాక్స‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే... బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ హీరో కాబ‌ట్టి కోలీవుడ్ మార్కెట్ ఓకే...అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడు కాబ‌ట్టి బాలీవుడ్ ఓకే...మ‌రి టాలీవుడ్ మార్కెట్ ప‌రిస్థితి ఏమిటి అని శంక‌ర్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ర‌జ‌నీకాంత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు చూస్తారు అందులో సందేహం లేదు. అయితే....టాలీవుడ్ స్టార్ హీరో 2.0లో న‌టిస్తే...ఇక్క‌డ రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించ‌వ‌చ్చు అని ఆలోచిస్తున్నార‌ట‌. తెలుగు స్టార్ హీరోతో 2.0లో ఓ క్యారెక్ట‌ర్ చేయించాల‌ని శంక‌ర్ ఫిక్స్ అయ్యారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే క‌నుక నిజ‌మైతే...ర‌జ‌నీ - శంక‌ర్ ల 2.0లో న‌టించే అవ‌కాశం ఏ స్టార్ హీరో ద‌క్కించుకుంటాడో చూడాలి..!