వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న రోబో 2
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం రోబో. సంచలన విజయం సాధించిన రోబో చిత్రానికి సీక్వెల్ గా రోబో 2.0 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న రోబో 2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది
ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ ట్విట్టర్ లో స్పందిస్తూ...రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ , అలాగే రజనీకాంత్, అక్షయ్ కుమార్ లపై క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యింది. నేటితో 100 రోజులు షూటింగ్ చేసాం. దీంతో 50% షూటింగ్ పూర్తయ్యింది అని తెలియచేసారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రోబో 2.0 వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com