'రోబో2'కి టెక్నికల్ టీమ్ కుదిరింది

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో', శివాజీ' చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. రోబో' సీక్వెల్ రోబో2'గా సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. సినిమాటోగ్రాపర్ నిర్వాషా, ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, ఆంటోని ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడట. నటీనటుల విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.