'రోబో2'కి ముహుర్తం కుదిరిందా...?
Send us your feedback to audioarticles@vaarta.com
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో కబాలి` అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ హిట్టయిన రోబో` సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న రోబో 2` చిత్రంలో నటించనున్నాడట. ఈ సినిమా చేయడానికి రజనీకాంత్ అల్రెడీ రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రస్తుతం శంకర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని టాక్.
ఈ సినిమాని వచ్చే ఏడాదిలో స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ డిసెంబ్ లోనే సినిమాని సెట్స్ లోకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ సినిమాలో విక్రమ్ విలన్ గా నటిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. తాజా సమచారం ప్రకారం రజనీకాంత్ పుట్టినరోజున రోబో సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com