'రోబో2'కు ముహుర్తం కుదిరిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం రోబో` సీక్వెల్ రోబో2`కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రోబో2` డిసెంబర్ 12న లాంఛనంగా ప్రారంభమవుతుందని అనుకున్నారు. అయితే అకాల వర్షాలతో చెన్నై నగరం నీట మునగడంతో ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించకూడదనుకున్న రజనీ, శంకర్ అండ్ టీం ఓపెనింగ్ ఫంక్షన్‌ను వాయిదా వేశారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రోబో 2` డిసెంబర్ 16న విదేశాల్లో ప్రారంభం కానుందట. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ అర్నాల్డ్ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments