రోబో 2.0 లేటెస్ట్ అప్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు తాజా షెడ్యూల్ కి రెడీ అవుతుంది. మిగిలిన షూటింగ్ పార్ట్ లో ఎక్కువు భాగం రజనీకాంత్ పైనే షూట్ చేయాలి. కబాలి రిలీజ్ టైమ్ లో ట్రీట్ మెంట్ కారణంగా రెస్ట్ తీసుకున్న రజనీ ఇక రోబో 2.0 షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నెల 23 నుంచి చెన్నైలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో రజనీకాంత్ తో పాటు అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు పాల్గొంటారు. ఈ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.రోబో 2.0 ఫస్ట్ లుక్ ను నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక మూవీని వచ్చే సంవత్సరం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com