శంక‌ర్‌కు త‌ల‌నొప్పులు స్టార్ట‌య్యాయి

  • IndiaGlitz, [Friday,December 18 2015]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 2.0. సీక్వెల్ ఆఫ్ రోబో ట్యాగ్ లైన్‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 16న చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా చేస్తున్నాడు. ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా రోబో పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ కూడా ప్రారంభం కాక‌ముందే రోబో సీక్వెల్‌కు త‌ల‌నొప్పులు స్టార్ట‌య్యాయి.

త‌మిళ మున్నేట్ర పడై అనే సంస్థ‌వారు ఈ సినిమాలో ఎమీ జాక్స‌న్‌ను తొలగించాల‌ని లేకుంటే ఈ నెల 21న శంక‌ర్‌, ర‌జనీకాంత్ ఇంటిని దిగ్భందం చేస్తామ‌ని హెచ్చ‌రిక‌ను జారీ చేశారు. వార‌లా చేయ‌డానికి కార‌ణం త‌మిళ‌నాడులో జ‌రిగే జెల్లిక‌ట్టు క్రీడ‌కు వ్య‌తిరేకంగా ఎమీజాక్స‌న్ అప్ప‌ట్లో వ్య‌తిరేకించింది. దీనికి ఇప్పుడు త‌మిళ తంబీలు ఇలా త‌మ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు మ‌రి...