Road Accident: విశాఖలో ఘర రోడ్డు ప్రమాదం.. చిన్నారులకు తీవ్ర గాయాలు..

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టడంతో ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆటోను లేపి పిల్లలకు సపర్యలు చేశారు. రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన అనంతరం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ కూడా గాయపడ్డాడని.. లారీ డ్రైవర్, క్లీనర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. పిల్లలు బోరున ఏడుస్తూ రక్తం కారుతున్న గాయాలతో రోడ్డుపై పడి ఉండటం అందరినీ చలింపచేస్తుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.

కాగా మరో ఘటనలో మధురవాడ-నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా.. వారందరూ స్వల్పంగా గాయపడ్డారు. నగరంలో వరుస ప్రమాదాల్లో విద్యార్థులు గాయపడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

More News

Sudigali Sudheer: కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు: సుడిగాలి సుధీర్

జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లి తెరపై సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇటీవల మూవీల్లో హీరోగా తన అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులే ఎక్కువ..

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి 360 మంది

National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..రూ.752కోట్ల ఆస్తులు జప్తు

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.752కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల

Pawan Kalyan: ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ప్రచారం పక్కా.. షెడ్యూల్ ఖరారు..!

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.