BiggBoss: కొత్త కెప్టెన్‌గా ఆర్జే సూర్య... రోహిత్ - మెరీనాల కార్వాచౌత్ సెలబ్రేషన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కంటెస్టెంట్స్ తమ పేరెంట్స్, భార్యా, భర్త, బిడ్డలతో మాట్లాడుతుండటంతో ఈ వారం హౌస్‌లో ఎలాంటి గొడవలు జరగలేదు. వాదనల్ని, వివాదాల్ని ఇష్టపడే వారికి బహుశా ఈ వీక్ నచ్చకపోవచ్చు. కానీ ఇంటి సభ్యుల మధ్య మాత్రం ఎలాంటి విభేదాలు లేకపోవడంతో చాలా చప్పగా షో సాగుతున్నట్లే వుంది. ఇక కెప్టెన్సీ కంటెండెర్స్ విషయానికి వస్తే... నిన్నటి ఎపిసోడ్‌లో ఎనిమిది బంతులు ఇచ్చి వాటిని ఎవరైతే తమ పేరున్న బాస్కెట్‌లో మొదటగా వేస్తారో.. ఆ ఎనిమిది మంది కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని చెప్పాడు. ముందుగా ఆదిరెడ్డి, రేవంత్, రాజశేఖర్, శ్రీసత్య, సూర్య, అర్జున్, వాసంతిలు బంతులను దక్కించుకుని తమ బుట్టల్లో వేసుకున్నారు. అయితే చివర్లో ఒకే ఒక్క బంతి వుండటంతో రోహిత్, మెరీనా, బాలాదిత్య, కీర్తి, ఫైమా, సుదీప ఒకరి మీద ఒకరు పడి కుస్తీలు పట్టారు. ఆ బంతిని ఎట్టకేలకు సుదీప దక్కించుకోవడంతో మెరీనా కంటతడి పెట్టుకుంది. తన భర్తకు కానీ, తనకు కానీ బంతి దక్కలేదని బాధపడింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని చేజిక్కించుకున్న సుదీప దానిని తన పేరుతో వున్న బాస్కెట్‌లో కాకుండా రోహిత్ బుట్టలో వేసింది. దీంతో అతను కూడా కెప్టెన్సీ పోటీదారుల లిస్ట్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు. చివరికి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్‌లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
ఈరోజు వీరందరికీ ‘‘ఆఖరి వరకు ఆగని పరుగు’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం... పూలకుండీల మీద కంటెండర్ల ఫోటోలు అతికించి వుంటాయి. బెల్ మోగినప్పుడు పోటీదారులు వారి పేరున్న పూలకుండీ కాకుండా ఇతరులది తీసుకుని కంటెండర్ జోన్‌లోకి వెళ్లాలి. లాస్ట్‌లో కంటెండర్ జోన్‌లోకి వెళ్లిన పోటీదారుడితో పాటు... అతడి చేతిలో ఏ సభ్యుడి పూలకుండీ వుంటుందో... ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని కెప్టెన్సీ పోటీదారులని తొలగించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు బిగ్‌బాస్.
గేమ్ స్టార్టింగ్‌లోనే రాజ్... తన కుండీని తానే తీసుకుని డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత వాసంతి.. ఆదిరెడ్డి కుండీని పట్టుకుంది. కానీ అందరికంటే లాస్ట్‌లో కంటెండర్ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వాసంతి, ఆదిరెడ్డిలలో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువమంది ఇంటి సభ్యులు ఆది వైపే మొగ్గు చూపారు. అలా వరుసగా రాజ్, వాసంతి, రేవంత్, అర్జున్, శ్రీసత్య, ఆదిరెడ్డిలు గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. చివరిలో సూర్య, రోహిత్ మిగిలారు. ఇంటి సభ్యులలో ఎక్కువమంది సూర్య వైపే మొగ్గు చూపారు. ఇక ఇనయా సంగతి సరే సరి. ఓటు అన్నయ్యకా..? బావకా అంటూ ఎక్స్‌ట్రాలు చేసింది. అందరూ ఊహించినట్లుగానే సూర్యకు ఓటు వేయడంతో అతను ఈవారం కెప్టెన్‌గా నిలిచాడు.
ఇక ఈరోజు చెప్పుకోవాల్సింది... సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది ‘‘మెరీనా అండ్ రోహిత్’’ కపులే. మొన్న బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ అవ్వాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలన్న బిగ్‌బాస్ కండీషన్ ప్రకారం.. ఇంటి సభ్యుల కోసం తాను రెండు వారాల పాటు నామినేషన్స్‌లో వుండేందుకు అంగీకరించాడు రోహిత్. కనీసం వాళ్ల పేరెంట్స్, రిలేటివ్స్‌తో మాట్లాడే అవకాశం కూడా రోహిత్, మెరీనాలకు కూడా రాలేదు. ఈరోజు కూడా తాను ఇంటి సభ్యుల కోసం త్యాగం చేస్తే.. వాళ్లేమో సూర్యను కెప్టెన్ చేశారన్న ఫీలింగ్ రోహిత్‌లో లేదు. దీంతో అతనికి రానున్న రోజుల్లో సింపథీ ఓట్లు బాగా పెరిగే అవకాశం వుంది. ఇక మెరీనా విషయానికి వస్తే... ఈరోజు రోహిత్‌కు ఓటేయకుండా సూర్యకి ఓటేసి అందరికీ షాకిచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఏదో ఒక కారణం వుండే వుంటుంది. కెప్టెన్ ఎంపిక పూర్తయిన తర్వాత మెరీనా దంపతులు కర్వా చౌత్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసం వుంటున్న మెరీనా.... సాంప్రదాయ దుస్తులు ధరించిన మెరీనా జల్లెడలో చంద్రుడిని చూసి ఆ వెంటనే తన భర్త రోహిత్‌ను చూసింది. తర్వాత ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com