ముందు నుండి సినిమాల ఎంపికలో సెలక్టివ్ గానే ఉంటున్నాను - రీతూ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రీతూ వర్మ పెళ్ళిచూపులు సూపర్‌హిట్‌తో లక్కీ హీరోయిన్‌గా మారింది. అయితే తాను మాత్రం సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గానే ఉంటాను అని అంటుంది రీతూ వర్మ. ఇప్పుడు దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కేశవ` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూవర్మ `కేశవ`గురించి వివరాలను తెలియజేసింది...
రీతూ వర్మ మాట్లాడుతూ... ```కేశవ` సినిమాలో లాయర్ స్టూడెంట్ పాత్ర చేశాను. సినిమాలో నా పాత్ర పేరు సత్యభామ. సినిమాలో ముందుగా కేశవను కలిసిన తర్వాత కేశవ హత్యలెందుకు చేస్తున్నాడో తెలియదు. కానీ ఆ హత్యలెందుకు జరుగతున్నాయనే కారణం తెలిసిన తర్వాత కేశవకు సత్యభామ సపోర్ట్ చేస్తుంది. నేను, నిఖిల్, కౌశిక్ సహా కొంత మంది స్టూడెంట్స్‌లాగా సినిమాలో కనిపిస్తాం. ఇప్పటి వరకు ఫీల్ గుడ్ మూవీస్‌లో చేశాను. ఏదైనా కొత్త జోనర్‌ల సినిమా చేయాలనుకున్నప్పుడు కేశవ సినిమా అవకాశం వచ్చింది.కథ నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాను.
ఓ హార్ట్ డిజార్డర్ ఉన్న యువకుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేశాడు. తన బలహీనతను బలంగా ఎలా మార్చుకుంటాడనే కాన్సెప్ట్ నచ్చింది. పాత్రల విషయంలో నేను ముందు నుండి సెలక్టివ్‌గా ఉంటున్నాను. గ్లామర్ పాత్రలు చేయాలని ఉంది. కానీ కేవలం పాటలకే పరిమితమైయ్యే గ్లామర్ పాత్రల్లో నటించలేను. కేశవ సినిమాలో డ్యాన్సులు చేయలేదు. లిప్ సింకింగ్ సాంగ్స్ కూడా లేవు. అన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో కేశవ తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను. తమిళంలో ధృవ నక్షత్రంలో నటిస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com