అనుప‌మ‌గా రీతూ వ‌ర్మ‌

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

వైవిధ్యమైన పోలీస్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్. ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. విమర్శకుల ప్రశంసలను అందుకునే కథానాయకుడు చియాన్ విక్రమ్. వీరిద్దరి కలయికలో ‘ధ్రువ నట్ఛ‌త్తిరం’ అనే త‌మిళ‌ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విక్ర‌మ్‌కు జోడీగా ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూవర్మ న‌టిస్తోంది. హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

ఇదిలా ఉంటే.. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో 'ఉత్త‌మ న‌టి'గా నంది అవార్డును సొంతం చేసుకున్న‌ రీతూ వర్మ.. ఈ సినిమాలో కూడా న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లోనే న‌టిస్తోంద‌ని స‌మాచారం. ఇందులో రీతూ పాత్ర పేరు అనుపమ అని..  చాలా స్టైలిష్‌గా ఉండే ఈ పాత్ర‌లో రీతూ చాలా చ‌క్క‌గా న‌టించింద‌ని గౌత‌మ్ మీన‌న్ చెప్పుకొస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.