అనుపమ స్థానంలో రితికా?
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తేజ్ - ఐ లవ్ యూ సినిమా చేస్తున్నాడు. జూన్ 29న ఈ సినిమా విడుదలవుతుంది. తదుపరిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాలో సాయిధరమ్ నటించబోతున్నాడు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ అని అనుకున్నారు. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో అనుపమ చేయడం లేదని.. ఆమె స్థానంలో రితికా సింగ్ నటించనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై కన్ఫర్మ్ న్యూస్ వెలువడే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments