డబ్బింగ్ చెప్పుకుంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు టాలీవుడ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా హీరోయిన్స్ అందరూ ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ వంతుగా కష్టపడుతున్నారు. పరభాషా నటీమణులైతే తెలుగును నేర్చుకుంటున్నారు. వారి పాత్రలకు వారే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటున్నారు.
కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయేల్, రకుల్ ప్రీత్ సింగ్, అదితిరావు హైదరీ సహా పలువురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు వీరి బాటలో అడుగుపెట్టిన హీరోయిన్ రితికా సింగ్. ఈమె నటిస్తున్న చిత్రం 'నీవెవరో'. ఈ సినిమాలో రితికా సింగ్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది.
ఇప్పటికే తన పాత్రకు దాదాపు డబ్బింగ్ చెప్పేసుకుందట. రితికా స్వంత వాయిస్ అయితే బావుంటుందని దర్శకుడు భావించడం.. ఆమెకు చెప్పడంతో .. రితికా కూడా ఎస్ చెప్పేసిందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న'నీవెవరో' చిత్రానికి హరికృష్ణ దర్శకుడు. కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతలు. ఇందులో తాప్సీ కూడా నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments