ఆరోగ్యంపై రిషి కపూర్ ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్‌కు క్యాన్సర్ అనే ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరుడు రణధీర్ ఆ వార్తల్లో నిజం లేదని అప్పట్లో తెలిపారు. అయితే రిషి కపూర్ గత కొన్ని రోజులుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స గురించి ఆయన మొదటిసారి మీడియాతో వెల్లడించారు.
ఎలాంటి సమస్యలు లేకుండా చికిత్స జరుగుతుంది. దేవుడి దయతో తిరిగొస్తాననే నమ్మకం ఉంది. చికిత్స చేయించుకోవాలంటే ఓపిక కావాలి. కానీ నాకు అంత ఓపిక లేదు. చికిత్స పూర్తి కావడానికి సమయం పడుతుంది. సినిమాల గురించి ఆలోచించడం లేదు. మానసిక విశ్రాంతి అవసరం అంటూ వెల్లడించారు రిషి కపూర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout