Vote:ఓటు హక్కు వినియోగించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉండే పవర్ అంతాఇంతా కాదు. దేశ పౌరుడు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే హక్కు ఇచ్చేది ఓటు హక్కు. ఒక్క ఓటు నాయకుల జీవితాలను తలకిందులు చేస్తుంది. దేశ, రాష్ట్ర స్థితిగతులనే మార్చే శక్తి ఓటుకు ఉంది. ప్రజలను పాలించే ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అత్యంత కీలకం. అలాంటి ఓటు హక్కును కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం రాజకీయ తంతుగానే చూస్తున్నారు. ఓటు వేయకుండా దేశం బాగుపడలేదు.. రాష్ట్రం బాగుపడలేదు అనే అడిగే హక్కు ఎవరికీ లేదు. ఓటు వేసిన వారికే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. అప్పుడే మనకు వ్యవస్థను ప్రశ్నించే వెసులుబాటు లభిస్తుంది.
కానీ ఉన్నత చదువులు చదువుకున్న వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు, సంపన్న వర్గాలు ఓటుకు దూరంగా ఉండటం చింతించాల్సిన విషయం. రాజకీయాలతో మాకేమి సంబంధం అన్నట్లు ఆ వర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమైన ఇలాంటి ధోరణి వల్లే పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో రానురాను ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. 2014లో హైదరాబాద్‌లో 53శాతం ఓటింగ్ పోలవ్వగా 2018లో 51శాతం మాత్రమే నమోదైంది. అందుకే ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఓటు హక్కు, దాని ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
అంతేకాకుండా పోలింగ్ రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవును కేవలం హాలీడేగా భావిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎవరైనా సరే ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప ఆయుధంగా భావించాలి. అప్పుడే నిజాయతీపరులైన నాయకులు చట్టసభలకు వెళ్తారు. తద్వారా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఓటు హక్కు వినియోగించుకుందాం.. ప్రశ్నించే హక్కును పొందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com