చిరుకీ ఓ లెక్కుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత కథానాయకుడుగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. చిరు రీ ఎంట్రీ 'కత్తి' రీమేక్‌తో జరగనుందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే.. చిరు కెరీర్‌కి సంబంధించి ఇది థర్డ్ ఇన్నింగ్స్ లాంటిది.
తొలి ఇన్నింగ్స్‌తో 'ప్రాణం ఖరీదు'తో మొదలైంది. ఇక రెండో ఇన్నింగ్స్.. వరుస పరాజయాల తరువాత (1996లో అసలు ఏ తెలుగు సినిమాతో పలకరించకుండా) 1997లో 'హిట్లర్' చేయడం ద్వారా ప్రారంభమైంది. ఆ సినిమా తరువాత మళ్లీ చిరు ఎన్నో రికార్డ్ హిట్స్ కొట్టారు. ఇప్పుడేమో భారీ విరామం తరువాత 'కత్తి' రీమేక్‌తో థర్డ్ ఇన్నింగ్స్ చేయనున్నారు.
విశేషమేమిటంటే.. సెకండ్ ఇన్నింగ్స్‌ని 'హిట్లర్' అనే మలయాళ చిత్రం రీమేక్‌తో స్టార్ట్ చేసిన చిరు.. థర్డ్ ఇన్నింగ్స్‌ని కూడా 'కత్తి' అనే రీమేక్‌తోనే చేసే దిశగా ఉండడం. ఈ వైనంతో చిరు ఇన్నింగ్స్‌కి ఓ లెక్కుందని అనుకోక తప్పదేమో. 'కత్తి' రీమేక్ కి సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com