మిర్చి హీరోయిన్.. తల్లి కాబోతుంది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మిర్చి’. రైటర్ కొరటాల శివ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. రిచా గంగోపాధ్యాయ, చదువు కోసం సినిమాలకు దూరమైంది. అంతే కాదండోయ్. తను ఫ్రెండ్, లవర్ అయిన జో లాంగేల్లాను 2019 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తాను తల్లిని కాబోతున్నానంటూ రిచా గంగోపాధ్యాయ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. ‘నేను, జో చాలా సంతోషంగా ఉన్నాం.. జూన్‌లో బేబీ లాంగేల్లా రానుంది’ అంటూ రిచా మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ కడుపుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది.
లీడర్ సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రిచా గంగోపాధ్యాయ, తర్వాత నాగవల్లి, మిరపకాయ్ వంటి పలు తెలుగు సినిమాలతో పాటు తమిళంలో గబ్బర్‌సింగ్ రీమేక్‌లోనూ నటించింది. సినిమాలకు 2013లో గుడ్ బై చెప్పేసింది. తాను చదువుకోసం సినిమాలకు దూరమవుతున్నట్లు కూడా చెప్పింది రిచా గంగోపాధ్యాయ. సినిమాలను వీడిన ఆరేళ్లకు పెళ్లి చేసుకుని సెటిలైంది. త్వరలోనే తల్లి కాబోతున్న రిచాకు నెటిజన్లు శుభాకాంక్షలను తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com